Publish Date: Wed, 08 May 2019 (11:16 IST)
Updated Date: Wed, 08 May 2019 (11:18 IST)
గ్రీన్ టీని పరగడుపున అసలు తాగకూడదు. దానికి బదులు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే బెటర్. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకి పోతాయి. కానీ ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే అసిడిటీ జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. లివర్కి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
రాత్రి పూట నిద్రకు గంటన్నర ముందు గ్రీన్ టీ తాగితే జీవక్రియలు బాగా జరుగుతాయి. ఇలా చేయడం వల్ల నిద్రపోతున్నా కూడా కొవ్వు వేగంగా కరిగిపోతుంది. బరువు కూడా తగ్గుతారు. అలాగే జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సమస్యలు చాలా వరకు దూరమవుతాయి.
గ్రీన్ టీ తాగడం వల్ల దంతాలు దృఢంగా మారతాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీ మైక్రోబియల్ దంతాలను సంరక్షిస్తాయి. గ్రీన్ టీలో చక్కెర, పాలు కలపకుండా తాగడం వల్ల అందులో ఉండే ఔషధ గుణాలు దంత సమస్యలను దూరం చేస్తాయి. గ్రీన్ టీ తాగితే బరువు తగ్గడమే కాకుండా గుండె జబ్బులు కూడా దరిచేరవు. శరీరంలోని చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.