Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ బెస్ట్‌ ఇంప్రెషన్‌'కు మినహాయింపు ఉంటుందట.. ఎలా?

Advertiesment
Impression
'ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ బెస్ట్‌ ఇంప్రెషన్‌' ఇదో ఆంగ్ల సామెత. ఈ సామెత ప్రకారం ఓ వ్యక్తిని తొలిసారి చూసినపుడు ఏర్పడిన భావ ఎప్పటికీ చెరిగిపోదని అర్థం. కానీ ఈ భావనకూ మినహాయింపులుండొచ్చని చెబుతున్నాయి అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు చేసిన పరిశోధనలు. అదెలాగో పరిశీలిద్ధాం. 
 
ఉదాహరణకు పార్టీలో మీరో వ్యక్తిని తొలిసారి కలవాలి అనుకున్నారు. కానీ, ఆరోజున మీకు అనుకోకుండా అస్వస్థకు గురయ్యారు. దీంతో తలనొప్పి. చికాగ్గా అనిపించింది. మిమ్మల్ని కలవడానికొచ్చిన వ్యక్తిపైనా ఆ చిరాకు చూపించారు! 
 
ఆ ఆంగ్ల సామెత ప్రకారం మీరెప్పుడూ ఇలా చిరాగ్గానే ఉంటారనే నమ్మకం ఆ వ్యక్తిలో కలుగుతుంది. కానీ అదే వ్యక్తిని మరోసారి కలుసుకున్నపుడు.. సహజ స్వభావంతో మీరు చక్కగా మాట్లాడితే ఆ పాత భావన తొలగిపోయే అవకాశం ఉందని ఈ పరిశోధన తేల్చింది. అయితే అది ఒకేసారి పోదు సుమా.. కొద్దికొద్దిగా మాత్రమే పోతుందట. 

Share this Story:

Follow Webdunia telugu