Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంటికి రెప్పపాటు చాలా అవసరం.. లేకుంటే..?

Advertiesment
Eye Care
, శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (20:39 IST)
కంటికి రెప్పపాటు చాలా అవసరం. రెప్పవేయడం వల్ల కళ్లు పొడిబారకుండా తేమగా ఉంటాయి. ఎక్కువ సమయం కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కంటిని బ్లింక్ చేయడం ప్రభావితమవుతుంది. తదేకంగా కంప్యూటర్లను చూడటం ద్వారా కళ్లల్లోని తేమ ఆవిరైపోతుంది. 
 
అందుకే ప్రతి గంటకు కొన్ని సెకన్ల పాటు మీ కళ్ళు రెప్పవేయడం కొనసాగించాలి. తర్వాత కొన్ని సెకన్ల పాటు కళ్లు మూసి.. కూర్చుని రిలాక్స్ కావాలి. ఈ వ్యాయామం కనురెప్పలను మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. తద్వారా కళ్లలో తగినంత తేమ నిల్వ ఉంటుంది. ఆప్టిక్ నరాలు రక్షించబడతాయి.
 
కంటి పొడి సమస్య ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి కంటికి ఐ డ్రాప్ వాడాలి. కళ్లు ఎరుపు తిరగడాన్ని నివారించేందుకు కంటి తేమ అవసరం. అందుకే కంటికి రెప్పపాటు అవసరం.
 
ఏ పనికైనా విశ్రాంతి తప్పనిసరి. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, మెడ నొప్పి, భుజం నొప్పి మొదలైన సమస్యలను నివారించడానికి, నిరంతర కంప్యూటర్ వినియోగం మధ్య తగిన విరామం తీసుకోవాలి. రోజంతా కూర్చుని పని చేసే బదులు కనీసం ప్రతి రెండు గంటలకు ఒకసారి లేచి నడవాలి. చేతులు, కాళ్లు, మెడను చాచి, కంటి వ్యాయామాలు చేయాలి. 
 
అర్థరాత్రి మొబైల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ చూడవద్దు. పడుకునే ముందు కనీసం గంటసేపు ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లను చూడటం మానుకోవాలి. ఇది నిద్రలో మెలటోనిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండంటే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తిని చూడండి