Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Advertiesment
Doctor Jyothy

ఐవీఆర్

, సోమవారం, 26 మే 2025 (22:17 IST)
హైదరాబాద్: ప్రాణాంతకమైన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో బాధపడుతున్న 23 ఏళ్ల మహిళకు హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స అందించింది. రోగి శ్రీమతి సాదియ(పేరు మార్చబడింది)తీవ్రమైన కడుపు నొప్పి, ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం, బలహీనతతో బాధపడుతున్న పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకురాబడింది. వైద్య బృందం వెంటనే అవసరమైన పరీక్షలు నిర్వహించి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించడంతో పాటుగా ఆమె ప్రాణాలను కాపాడటానికి తక్షణ చర్య తీసుకుంది.
 
భారతదేశంలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ఈ తరహా గర్భాలు అంతర్గత రక్తస్రావం, ఫెలోపియన్ ట్యూబ్ చిట్లడం లేదా షాక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ముందుగానే గుర్తించకపోతే తల్లి ప్రాణానికి ప్రమాదం కలిగే అవకాశాలు కూడా వున్నాయి. అధిక అంతర్గత రక్తస్రావం కారణంగా శ్రీమతి సాదియ పరిస్థితి విషమంగా మారింది. ప్రసూతి & గైనకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ జ్యోతి కంకణాల నేతృత్వంలోని ఆసుపత్రి నిపుణుల బృందం, ప్రభావితమైన ఫెలోపియన్ ట్యూబ్‌ను తొలగించడానికి మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ విజయవంతంగా నిర్వహించింది.
 
సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ RCOO డాక్టర్ ప్రభాకర్ పి. మాట్లాడుతూ "సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌ వద్ద మేము క్లిష్టమైన కేసుల సమయంలో వేగవంతమైన రీతిలో స్పందించటంతో పాటుగా ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇస్తాము. రోగికి ఉత్తమ ఫలితాన్ని నిర్ధారించడానికి మా బహుళ విభాగ బృందం సమిష్టిగా పనిచేస్తుంది. ఈ కేసు అధిక-ప్రమాదకరమైనప్పటికీ అత్యవసర పరిస్థితులను సైతం అత్యున్నత సామర్థ్యంతో నిర్వహించడంలో మా నైపుణ్యాన్ని వెల్లడిస్తుంది" అని అన్నారు. 
 
ఈ కేసు గురించి డాక్టర్ జ్యోతి కంకణాల మాట్లాడుతూ, "ఈ రకమైన గర్భధారణను ముందుగానే నిర్ధారించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ప్రాణాంతకం కావచ్చు. ఫలదీకరణ చెందిన అండం గర్భాశయం వెలుపల పెరుగుతున్నప్పుడు ఎక్టోపిక్ గర్భం సంభవిస్తుంది. సకాలంలో రోగ నిర్ధారణ చేసి చికిత్స చేయకపోతే ఎక్టోపిక్ గర్భాలు ప్రాణాంతకం కావచ్చు. సమస్యలను గుర్తించడానికి, నివారించడానికి మహిళలు ముందుగానే స్కాన్‌లు చేయించుకోవాలని సూచిస్తున్నాను. వేగంగా మేము స్పందించటం, అధునాతన శస్త్రచికిత్సా పద్ధతులు రోగికి ఉత్తమ సంరక్షణ లభించేలా చేశాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటం చేత డిశ్చార్జ్ చేయబడింది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..