నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మహిళల్లో నెలసరి ఇబ్బందులను దూరం చేస్తుంది. నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గిస్తుంది. నల్ల జీలకర్ర, తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్‌లో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
నల్ల జీలకర్ర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ పెరగనివ్వకుండా నివారిస్తుంది. అధిక బరువు, కడుపు ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేస్తుంది.
నల్ల జీలకర్ర నీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నల్ల జీలకర్ర గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.