శరీరంలో అధికంగా ఉండే కొవ్వును కరిగించంలో, బీపీని నియంత్రించడంలో, చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో నల్ల జీలకర్ర తోడ్పడుతుంది. శరీరంలో ఉండే నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా ఇన్‌ఫెక్షన్‌ల బారినపడుతున్నారు. కనుక నల్ల జీలకర్రను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి, ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడకుండా ఉంటారు.
నల్ల జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చు. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రరను వేసి అర గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఈ కషాయాన్ని గోరు వెచ్చగా ఉదయం పరగడుపున తాగడం వల్ల మనం రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది.
కడుపు సంబంధిత సమస్యలను, మూత్రపిండాల సంబంధిత సమస్యలను, కాలేయ సంబంధిత సమస్యలను, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను నయం చేయడంలో నల్ల జీలకర్ర దివ్య ఔషధంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నల్ల జీలకర్ర తరచూ తింటే ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చని వైద్యులు చెప్తున్నారు.
నల్ల జీలకర్ర ఎక్కువగా తినే వారిలో జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, వాంతులు, గ్యాస్, అపానవాయువు వంటి సమస్యలు ఉన్నవారు దీన్ని ఎక్కువగా వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. నల్ల జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెప్తున్నారు.