Publish Date: Thu, 07 Jan 2016 (08:33 IST)
Updated Date: Thu, 07 Jan 2016 (08:35 IST)
అరటిపండులో తేనె, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరు నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యంతో మెరుస్తాయి. కొబ్బరి పాలను ముఖానికి పట్టించి మృదువుగా మర్ధన చేసి కాసేపయ్యాక కడిగేస్తే మెరిసిపోతుంది.
నాలుగు చెంచాల నిమ్మరసానికి, రెండు చెంచాల పుదీనా రసం చేర్చి దూదితో మోచేతుల మీద రుద్దాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే మోచేతుల గరుకుదనం తగ్గుతుంది. కమలాపండు జ్యూస్‌ని చర్మంపై మృదువుగా రుద్దితే చర్మం మృదువుగా, కాంతివంతంగా అవుతుంది.
నాలుగు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌లో రెండు టీ స్పూన్ల వెన్న కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో ముఖానికి, మెడకి రాసి మృదువుగా మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది.