Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజుకో ఉసిరికాయ చాలు.. ఆరోగ్యం మీ వైపే...నడుము చుట్టూ కొవ్వు..?

రోజుకో ఉసిరికాయ చాలు.. ఆరోగ్యం మీ వైపే...నడుము చుట్టూ కొవ్వు..?
, శనివారం, 18 జనవరి 2020 (18:24 IST)
అవును.. రోజుకో ఉసిరికాయను తీసుకుంటే చాలు.. ఆరోగ్యం మీవైపే వుంటుందని వైద్యులు చెప్తున్నారు. అనారోగ్య సమస్యలను, నీరసాన్ని దూరం చేసుకోవాలంటే.. ఉసిరికాయను తినాలి. పెద్దలు, పిల్లలు ఏదో ఒక రూపంలో వయోబేధం లేకుండా ఉసిరిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
పుష్కలమైన విటమిన్‌-సి, బ్రహ్మాండమైన రోగనిరోధక శక్తి, ఎల్లప్పుడూ ఉత్సాహం, సకల రోగాల పాలిటి శత్రువు ఉసిరికాయ పనిచేస్తుంది. జీవితమంతా ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకో ఉసిరికాయ తినాల్సిందే. సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన ‘త్రిఫల చూర్ణం’లో ఒకటి ఉసిరికాయ. మిగిలిన రెండు, కరక్కాయ, తానికాయలు. ఈ చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇందులో విటమిన్-సి, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. కెలోరీలు తక్కువ. చర్మరక్షణ, కేశ సంరక్షణ, రోగనిరోధక వ్యవస్థలకు ఆమ్లా ఎంతో మేలు చేస్తుంది. 
 
ముఖ్యంగా శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి వాటి బారిన పడకుండా ప్రజలు దీన్ని విరివిగా తినేవారు ఉసిరికాయను తినాల్సిందే. బరువు తగ్గాలని కోరుకుంటే, ఉసిరి కాయను టేస్టు చేయాల్సిందే. రోజుకు ఒకటి తీసుకోవాల్సిందే. నడుం దగ్గరి కొవ్వును కరిగించి, సన్నని, నాజూకైన నడుమును బహుమతిగా ఇస్తుంది ఉసిరికాయ.  డయాబెటిస్‌ ఉన్నవారికి ఇది అమృతం లాంటిది.
 
ఇన్సులిన్‌ స్పందనను పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించగలుగుతుంది. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు కూడా ఉసిరిని తమ ఆహారంలోకి చేర్చుకుంటే చాలా ప్రయోజనాలు పొందవచ్చు.  ఉసిరికాయలోని రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు, గాయాలను త్వరగా నయం చేయడంలో బాగా ఉపయోగపడతాయి.

యవ్వనవంతమైన చర్మం, గ్రే కలర్‌ లేని కేశాలు కావాలంటే, ఉసిరిని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. కంటి, దంత సమస్యలను కూడా ఉసిరికాయ తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సండే స్పెషల్.. వెన్నతో కొరమీను చేపల ఫ్రై ఎలా చేయాలంటే?