Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విఘ్నేశ్వరుడిని 12 నామాలతో స్తుతించండి

Advertiesment
వినాయక చతుర్థి
WD
వినాయక చవితి రోజున గణేశునిని 12 నామాలతో స్తుతించేవారికి జ్ఞానం, సంపద కలుగుతుందని విశ్వాసం. విఘ్నేశ్వరుని తొండం జ్ఞానానికి ప్రతీక అని, ఆయన నాలుగు చేతులు వేదాలకు ప్రతినిధులు అని పురోహితులు చెబుతున్నారు.

ఇంకా గణేశుని పెద్దచెవులు విచక్షణ కలిగి ఉంటాయని, అవసరం లేనివాటిని అవసర అంశాల నుంచి వేరు చేయడానికి ప్రతిబింబాల వంటివని వారు అంటున్నారు. ఇకపోతే.. గణేశుడి చేతిలోని పాశం వంచనకు పగ్గాలు వేస్తుంది. మోదకం విజ్ఞానాన్ని, అంకుశం విశ్వాన్ని సరైన దిశలో నడిపిస్తుంది.

ఇలా విజ్ఞానానికి సర్వస్వంగా నిలిచిన గణనాథుడిని వక్రతుండ, ఏకదంత, కృష్ణ పింగాక్ష, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ, బాలచంద్ర, వినాయక, గజానన, గణపతి అని 12 నామాలతో స్తుతిస్తాం.

ఈ పన్నెండు నామాల అర్థమేమిటంటే..? వక్రతుండ అంటే ఒంపు తిరిగిన తొండం కలవాడని, ఏకదంత.. ఒకే దంతం కలిగిన వాడని పేర్కొంటారు. అలాగే గజవక్త్ర అంటే.. ఏనుగు నోరు కలవాడని, లంబోదర.. పెద్ద ఉదరం కలవాడుగా స్వామిని స్తుతిస్తారు.

ఇంకా విఘ్నాల్ని తొలగించే రాజుగా విఘ్నరాజ అని, బూడిదవర్ణం కలవాడు (ధూమ్రకర్ణ), శివగణాలకు అధిపతి (గణపతి), విఘ్నాల్ని తొలగించే రారాజుగా (వినాయక), అర్థచంద్రుడిగా (బాలచంద్ర), నిండు రంగు కన్నులు కలవాడు (కృష్ణ పింగాక్ష)గా ఆదిదేవుడిని స్తుతిస్తారు. ఆ దేవదేవుని అనుగ్రహం కోసం జరుపుకునే పర్వదినాన అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు..!.

Share this Story:

Follow Webdunia telugu