గణేశ ఉత్సవం ఎలా జరుపుకోవాలి..?
గతంలో హైదరాబాద్‌కే పరిమితమైన గణేశ ఉత్సవాలు ప్రస్తుతం రాష్ట్రమంతటా వ్యాపించాయి. ప్రస్తుతం వీధివీధినా గణేశుని విగ్రహాలు ఏర్పాటు చేసి, నిత్యం పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో తొమ్మిది రోజుల పాటు రంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిలువెత్తు దేవుని విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం విధిగా పూజ నిర్వహించాలి. కొండంత దేవుడికి కొండంత పత్రి సమర్పించలేకపోయినా ఫలమో, పత్రమో ఏదోఒకటి స్వామికి నివేదించాలి. గణేశుని ఉత్సవాలు నిర్వహించేవారికి భక్తి, ముక్తి రెండూ లభిస్తాయి. * జల, పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధ్యమైనంతవరకు మట్టి వినాయకుని విగ్రహాలనే ప్రతిష్టించాలి. అతిగా రంగులు వాడిన బొమ్మలను వాడకపోవడం మంచిది. * చవితి రోజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలి. ఆ రోజు నుంచి ఒక పూట అయినా ప్రసాదం నైవేద్యం చేసి దానిని అందరికీ పంచితే బాగుంటుంది. * చవితి రోజు నుంచి నిమజ్జనం చేసేంతవరకు నిత్యం ఉదయం, సాయంత్రం యధాశక్తి పూజలు నిర్వహించాలి.