ఈ గణపతి విలువ రూ.600 కోట్లు... నిమజ్జనం చేస్తారా...?
సూరత్: గణేశుడిని సామాన్యులు అంతా మంటపంలో కొలుస్తారు... ఇంట్లో చేసుకునేవారు మట్టి వినాయకుడిని పూజిస్తారు. అయితే, బొజ్జ గణపయ్యను రకరకాల రూపాల్లో చూసుకుంటుంటారు భక్తులు. అందుకే వివిధ అలంకరణల్లో, వివిధ భంగిమల్లో గణేషుడిని తయారుచేసుకుని ప
సూరత్: గణేశుడిని సామాన్యులు అంతా మంటపంలో కొలుస్తారు... ఇంట్లో చేసుకునేవారు మట్టి వినాయకుడిని పూజిస్తారు. అయితే, బొజ్జ గణపయ్యను రకరకాల రూపాల్లో చూసుకుంటుంటారు భక్తులు. అందుకే వివిధ అలంకరణల్లో, వివిధ భంగిమల్లో గణేషుడిని తయారుచేసుకుని పూజించడం ఆనవాయితీ.
కానీ, మహారాష్ట్రలోని సూరత్‌లో భక్తులు నెలకొల్పిన ఖరీదైన డైమండ్ విగ్రహమిది. దీని విలువ 600 కోట్ల రూపాయలు... డైమండ్ సిటీగా పేరొందిన సూరత్‌లో వజ్రాల వ్యాపారుల సిండికేట్ అంతా కలిసి ఈ డైమండ్ విగ్రహాన్ని నెలకొల్పారు. వజ్రాల వ్యాపారులు డైమండ్ గణేషుడిని ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అయితే, చివరికి ఈ విగ్రహాన్ని నిమజ్జనం మాత్రం చేయరు... ఎందుకంటే... వజ్రాల వినాయకస్వామి కదా!