Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినాయకుడిని తులసీ పత్రాలతో పూజించవచ్చా?

Advertiesment
వినాయకుడిని తులసీ పత్రాలతో పూజించవచ్చా?
, శనివారం, 7 సెప్టెంబరు 2013 (14:58 IST)
వినాయక చవితినాడు విఘ్నేశ్వరుని 21 పత్రాలతో పూజించడం సంప్రదాయం. అయితే ఈ పత్రాల్లో తులసీ దళానికి చోటుండదు. సర్వదేవతలకు పవిత్రమైనటువంటి తులసీ పత్రం వినాయకుడి పూజకు ఎందుకు పనికి రాదో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ కథనం చదవండి. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవటానికి కారణం ఏమిటంటే.. 

ఓసారి గంగాతీరంలో విఘ్నేశ్వరుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది. దానికి వినాయకుడు నిరాకరించడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి, దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది.

ప్రతిగా వినాయకుడు ధర్మధ్వజ రాజపుత్రికను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండామని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా, వినాయకుడు శాంతించి, రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు.

అందుకే వినాయకుడు తులసిని తన పూజా పత్రిలో ఇష్టపడడు. ఇంకా తులసి వినాయక పూజ ఆశించిన ఫలితాలను ఇవ్వదని పురోహితులు అంటున్నారు. అందుచేత వినాయకుడికి ప్రీతికరమైన పత్రాలతో పూజించాలని వారు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu