Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొజ్జ గణపయ్యకు నమో నమో..!

Advertiesment
వినాయక చవితి
WD
"శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్య విఘ్నోప శాంతయే"||

తొలుత ఏపనిని ప్రారంభించినా గణపతి పూజతో ప్రారంభిస్తాం. అకార ఉకార మకార ఓంకార స్వరూపుడు, సకల విద్యలను ప్రసాదించేవాడు, విఘ్నములను తొలగించే ఆదిమూర్తి.. వినాయకుడు. భాద్రపదమాసంలో, శుక్లపక్షం నాలుగో రోజున గణపతి పుట్టాడు. ఆ రోజునే వినాయక చవితిగా జరుపుకుంటున్నాం. పండుగలలో విశిష్టమైన ఈ పర్వదినాన్ని పిన్నల నుండి పెద్దలవరకు భక్తి శ్రద్ధలతో ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతా గణాలందరికీ విఘ్నేశ్వరుడు ప్రభువు అని పురోహితులు అంటున్నారు. బ్రహ్మ తొలుత సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్లు ఋగ్వేదం చెబుతోంది.

బ్రహ్మవైర్తన పురాణము నందు "గణ" శబ్దానికి "గ" అంటే విజ్ఞానమని "ణ" అంటే మోక్షమనే అర్థం చెప్పబడియున్నది. ఈ సృష్టి అంతా గణాలతో కూడుకొన్నది. అటువంటి గణాలన్నీ కలిస్తే ఈ ప్రపంచం.

ఇట్టి ప్రపంచాన్ని అహంకారానికి గుర్తు అయిన మూషికాన్ని అధిరోహించి పాలించే ప్రభువైన మహాగణపతిని వినాయక చవితినాడు పూజించే వారికి సకలసంతోషాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అందుచేత.. విజ్ఞాన, మోక్షాదాలను ప్రసాదించే గణపయ్యను మనమందరం భక్తి శ్రద్ధలతో ప్రార్థిద్దామా...!.

Share this Story:

Follow Webdunia telugu