Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గణపతిని గణనాయకుడని ఎందుకు పిలుస్తారు?

గణపతిని గణనాయకుడని ఎందుకు పిలుస్తారు?
, శుక్రవారం, 6 సెప్టెంబరు 2013 (18:03 IST)
చరిత్రను బట్టి చూస్తే, ఏనుగు తలకాయ, మనిషి శరీరం ఉన్న విగ్రహాన్ని పూజించడం ఒక్క మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజిస్తున్నట్లు తెలుస్తోంది. పూరాతత్వ శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం భారతదేశంలోకాక బర్మా, థాయ్‌లాండ్, కంబోడియా, పర్షియా, నేపాల్, టిబెట్టు, మంగోలియా, చైనా, జపాన్, తుర్కిస్థాన్, బల్గేరియా, మెక్సికో, పెరు వంటి చాలా దేశాలలో గణపతి పూజ జరిగేది. 

ఆప్ఘనిస్తాన్‌లోని గార్డెజ్ వద్ద 60. సెం.మీ ఎత్తు, 35 సెం.మీ వెడల్పు ఉన్న పాలరాతి గణపతి విగ్రహం దొరికింది. ఇది ఆరో శతాబ్దానికి చెందినది చరిత్రకారుల అంచనా. టిబెట్‌లో బౌద్ధ మందిరాల వద్ద గణపతి విగ్రహాలు ఉంటాయి. మంగోలియాలో వినాయకుడు ఎలుక మీద ఉంటాడు.

ఎలుక నోట్లో చింతామణి ఉంటుంది. నేపాల్లో అయిదు తలలు, పది చేతులున్న హేరంబ గణపతిని పూజిస్తారు. థాయలాండ్‌లో వినాయకుడికి నాగ యజ్ఞోపవీతం ఉంటుందట. స్త్రీ పురుష రూపంలో పెనవేసుకున్న గణపతిని చైనా జపాన్‌లలో ఇళ్ళలోనే పూజించుకుంటారట.

దీనికంతకు కారణం ఈ ప్రదేశాలన్నింటిలోను ప్రాచీన కాలంలో గణ వ్యవస్థ రాజ్యం చేయడమేనంటారు. ఆ వ్యవస్థలో ప్రతి గణానికి ఒక నాయకుడు ఉండేవాడనీ, అతడినే గణనాయకుడని, గణపతి అని పిలిచేవారనీ అంటారు. ఎవరింటిలో ఏ కార్యం తలపెట్టినా ఆ గణపతిని ఆహ్వానించి పూజించేవాళ్ళట. అలా చెయ్యకపోతే విఘ్నాలు కల్పిస్తాడని భయం. ఆ భయంతోనే అతణ్ణి విఘ్నపతి అని కూడా పిలిచేవాళ్ళు.

అదేవిధంగా ఋగ్వేదంలోని మూడవ మండలంలో 23వ మంత్రంలో గణపతి అనే పదం కనిపిస్తుంది. 'గణానాం త్వా గణపతి గుం హవాహహే......' కాని, ఈ మంత్రం బ్రహ్మణస్పతి- లేదా బృహస్పతిని ఉద్దేశించిందని పండితాభిప్రాయం. తైత్తిరీయ అరణ్యకంలో 'దంతిని' అనే పదం, నారాయణో పనిషత్తులో 'వక్రతుండ' పదం గణపతిపరంగా కనిపిస్తాయి. అంతకు మించి వైదిక సాహిత్యంలో వినాయకుడు కనిపించడు.

అయితే స్మృతి ప్రకారం, బ్రహ్మరుద్రులు వినాయకుడిని విఘ్నాలను కలిగించే క్షుద్ర గుణాలకు అధిపతిగా నియమించారు. ఈ గుణాలు ఆవహిస్తే, ఏ పని తలపెట్టినా నెరవేరదట. ఇక మనుస్మృతికి వస్తే గణపతిని ఆరాధించేవాళ్ళట. అలా పూజింటాన్ని గణయాగం అనేవాళ్ళు. ధర్మశాస్త్రాలన్నీ గణపతిని విఘ్నాకృతి, విఘ్నరాజ, విఘ్నేశ్వర అనే సంబోధించాయి. బౌద్ధాయనుడు కూడా క్లుప్తంగా 'విఘ్న' అని మాత్రమే గణపతిని పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu