వెరైటీ వెజ్ పులావ్‌ను చికెన్ గ్రేవీతో సర్వ్ చేస్తే..!
, సోమవారం, 10 డిశెంబరు 2012 (13:47 IST)
మీరు బక్క పలచగా ఉన్నారా.. అయితే వెరైటీ పులావ్‌ను తీసుకోండి. ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే.. ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలు ఇందులో చేర్చడమే. ఇంకా చికెన్ గ్రేవీ సైడిష్‌గా వడ్డిస్తే పిల్లలు లొట్టలేసుకుని మరీ తింటారు. అలాంటి వెరైటీ వెజ్ పులావ్‌ను ఎలా చేయాలో తెలుసా..కావలసిన పదార్థాలు :బాస్మతి బియ్యం : మూడు కప్పులు. జీలకర్ర : ఒక టీ స్పూన్. మసాలా ఆకులు : రెండు. లవంగాలు, మిరియాలు : నాలుగేసి. క్యారెట్, మొక్కజొన్న గింజలు : రెండు కప్పులు. క్యాలీప్లవర్, పచ్చిబఠాణీలు, బీన్స్ ముక్కలు : అరకప్పు. నెయ్యి : రెండు టీ స్పూన్లు. పసుపు : ఒక టీ స్పూన్ఉప్పు, కారం : తగినంత నీరు : ఆరు కప్పులు. నిమ్మకాయ : ఒకటి.
తయారీ విధానం:ముందుగా బియ్యం కడిగి అరగంట సేపు నానబెట్టాలి. బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, మసాలా ఆకులు, లవంగాలు, మిరియాలు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత కూరగాయల ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి వేయించాలి. నీరుపోసి కలపాలి. ఐదు నిమిషాల తరువాత, బియ్యం కలపాలి. సన్నని మంట మీద నీరు ఇగిరేవరకు ఉడికించాలి. తరువాత నిమ్మరసం చేర్చి వేడివేడిగా సర్వ్ చేయాలి. ఈ పలావుకు చికెన్ గ్రేవీని సైడిష్‌గా వాడుకోవచ్చు.