వంకాయతో జీడిపప్పు కూర ఎలా చేయాలో తెలుసా?
, శనివారం, 2 మార్చి 2013 (15:56 IST)
వంకాయలు తింటే కీళ్లనొప్పులు మటుమాయం అవుతాయి. అదే జీడిపప్పును వేయించకుండా కూరల ద్వారా ఉడికించి తీసుకుంటే ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు. ఇవి రెండింటితో కూర చేస్తే ఎలా ఉంటుంది.. టేస్ట్ చేయాలనుకుంటున్నారా.. అయితే వంకాయతో జీడిపప్పు కూర ట్రై చేయండి. కావలసిన పదార్థాలు :వంకాయలు - పావు కేజీ. జీడిపప్పు - పావు కేజీ. ఉప్పు - తగినంత. పసుపు - చిటికెడు. పోపుకు కావాల్సినవిజీలకర్ర - పావు టీ స్పూన్. శనగపప్పు - ఒక టీ స్పూన్. కరివేపాకు - కొద్దిగా. అల్లం - చిన్న ముక్క. పచ్చిమిర్చి - రెండు. నూనె - మూడు టీ స్పూన్లు. కొత్తమీర - కొద్దిగాఎండిమిర్చి - 4. ఆవాలు - అర టీ స్పూన్. మినప పప్పు - ఒక టీ స్పూన్. జీలకర్ర - పావు టీ స్పూన్. తయారీ విధానం: ముందుగా ఉప్పు వేసిన నీటిలో తరగిన వంకాయ ముక్కలు వేయాలి. బాణలిలో నూనె మరిగాక ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, మిగిలిన పోపు వేయించి, అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి వేగాక, జీడిపప్పు, వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి సన్న సెగలో మూత పెట్టి ఉడికించారు. చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.. వంకాయతో జీడిపప్పు కూర రెడీ.. ఈ కూరను రోటీలకు, నేతి అన్నానికి సైడిష్గా సర్వ్ చేయవచ్చు.