వంకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసా!?
, శుక్రవారం, 8 జూన్ 2012 (18:08 IST)
ఆహా ఏమి రుచి, తినరా మైమరచి, తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయే అన్నట్లు.. వేసవి కాలంలో పచ్చళ్లను, ఊరగాయలు తయారు చేసి భద్రంగా దాచేస్తాం. అలాగే వంకాయ పచ్చడిని తయారు చేయండిలా.. కావలసిన పదార్థాలు:వంకాయలు : రెండు కేజీలు. ఉప్పు : తగినంతకారం : తగినంత. చింతపండు : అరకేజీ. నూనె : వేపుడుకు తగినంతతయారీ విధానం:ముందుగా వంకాయలు శుభ్రంగా కడిగి, తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు, ఉప్పు, కొంచెం వంకాయ ముక్కలు వేసి, కారం కూడా వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మెదిగిన తరువాత మిగిలిన వంకాయ ముక్కలు వేసి కొంచెం పలుకుగా రుబ్బుకొని తీసుకోవాలి. ఈ మిశ్రమానికి పోపు పెట్టుకోవాలి. బాణలి వేడయ్యాక నూనె పోసి ఆవాల గింజలు, ఇంగువ వేసి రుబ్బుకున్న వంకాయ మిశ్రమాన్ని కాసేపు నూనెలో వేయించి ఆరాక సీసాల్లో భద్రపరుచుకోవచ్చు. ఈ పచ్చడిని వేడిగా అన్నంలోకి గానీ రోటీల్లోగానీ సైడిష్‌గా వాడుకోవచ్చు.