మునగాకుతో సూప్: వర్షాకాలం టేస్ట్ చేస్తే అదిరిపోద్ది!
మునగాకుతో సూప్ ఎలా చేయాలో మీకు తెలుసా.. అయితే ఈ కథనం చదవండి. పిండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే సర్వరోగ నివారిణి 'మునగాకు''. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఐరన్ శక్తి పుష్కలంగా ఉంది. అలాంటి మునగాకుతో సూప్ చేయడం ఎలా?కావలసిన పదార్థాలు మునగాకు - ఒక కప్పు పుదీనా, కరివేపాకు, కొత్తిమీర తరుగు - అర కప్పు మిరియాల పొడి - అర టీ స్పూన్ జీలకర్ర పొడి - పావు టీ స్పూన్ ఉప్పు - తగినంత కొబ్బరి పాలు - పావు కప్పు పసుపు పొడి - చిటికెడు తయారీ విధానం : ముందుగా మూడు కప్పుల నీటిలో మునగాకు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర తరుగులో పసుపు, ఉప్పు చేర్చి మరిగించాలి. ఆకులోని రసం నీటిలో దిగాక ఓ ప్రత్యేక పాత్రలో వడగట్టుకోవాలి. కాస్త ఆరాక అందులో కొబ్బరిపాలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి కలిపి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేస్తే ఈ వర్షాకాలం టేస్ట్ అదిరిపోద్ది. ఈ సూప్‌కు సైడిష్‌గా కార్న్ సైడిష్‌గా వాడుకోవచ్చు.