మునగాకుతో పచ్చడి తయారు చేయడం ఎలా?
, శుక్రవారం, 11 అక్టోబరు 2013 (16:35 IST)
కావలసినని : మునగాకు : కప్పుజీలకర్ర : టీస్పూనువెల్లుల్లి : 6 రెబ్పలునువ్వులు : పావు కప్పుపసుపు : కొద్దిగాఉప్పు : తగినంతనూనె : 2 టీస్పూన్పచ్చిమిర్చి : ఆరుచింతపండు : కొద్దిగాతాలింపుకోసం : ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి : కొద్దికొద్దిగాకరివేపాకు : రెండు రెబ్బలుతయారు చేసే విధానం : ముందుగా బాణిలో నువ్వులు వేసి వేయించి తీసి చల్లారనివ్వాలి. అదే బాణిలో నూనె వేసి కాగాక, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన మునగాకు వేసి వేయించి చల్లార్చాలి. మిక్సిలో ముందుగా నువ్వులు వేసి పొడి చేశాక, వెల్లుల్లి, జీలకర్ర, వేసి తిప్పాలి. తరువాత పచ్చిమిర్చి, మునగాకు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. చిన్న బాణిలో కొద్దిగా నూనె వేసి తాళింపు దినుసులు వేసి వేయించి పచ్చడిలో కలపాలి.