మష్రూమ్‌తో వెరైటీ డిష్ ట్రై చేయండి
కొబ్బరి పాలలో విటమిన్స్, మినిరల్స్, మాంగనీస్, కాపర్, విటమిన్ సి వున్నాయి. అలాగే మష్రూమ్‌లలో డయాబెటిస్‌ను నియంత్రించే పోషకాలెన్నో వున్నాయి. ఈ రెండింటితో వెరైటీ డిష్ ట్రై చేద్దామా.. మష్రూమ్, కొబ్బరి పాలతో చేసే మష్రూమ్ స్ట్యూ మీ కోసం.. మష్రూమ్ - 200 గ్రాములు ఉల్లి తరుగు - అరకప్పు అల్లం పేస్ట్ - ఒక టీ స్పూన్ పచ్చి మిర్చి - నాలుగు కొబ్బరి పాలు - అరకప్పు ఉప్పు - తగినంత కరివేపాకు - కాసింత కొబ్బరి నూనె - అర టీ స్పూన్ వంట నూనె - అర టీ స్పూన్ తయారీ విధానం : ముందుగా బాణలిలో నూనె పోసి వేడయ్యాక, ఉల్లి తరుగు, అల్లం పేస్ట్, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా దోరగా వేపుకోవాలి. తర్వాత శుభ్రం చేసిన మష్రూమ్స్‌ను చేర్చి వేపాలి. ఇందులో తగినంత ఉప్పు చేర్చాలి. కొబ్బరి పాలును అందులో కలపండి. మష్రూమ్స్ ఉడికాక.. అందులో కరివేపాకు తురుము చేర్చి కొబ్బరి, వంటనూనె కలిపి కాసేపు మూత పెట్టి వుంచి దించేయాలి. మష్రూమ్స్‌తో ఈ వెరైటీ గ్రేవీని రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేయొచ్చు.