సాధారణంగా ఎగ్ మసాలాను ప్రతి ఇంటిలో చేసుకుంటుంటారు. అలాగే, కొన్నీ సీజన్‌లలో మాత్రమే (ప్రకృతి సహజ సిద్ధంగా లభించే మష్రూమ్స్) అరుదుగా లభించే మష్రూమ్‍తో మష్రూమ్ పనీర్ మసాలాను ఎలా తయారు చేసుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం.
తయారీకి కావలసిన పదార్ధాలు
పుట్టగొడుగులు (మష్రూమ్స్) : 100 గ్రాములు
పనీర్ : 100 గ్రాములు
ఉల్లిపాయలు : సన్నగా తరిగిన ఉల్లిపాయలు సరిపడ
పసుపు : సరిపడ
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : సరిపడ
పచ్చి మిర్చి : నాలుగు
ధనియాల పొడి : సరిపడ
గరం మసాలా పొడి : సరిపడ.
కొబ్బరి పొడి : 2 టీస్పూన్లు
ఉప్పు : తగినంత
జీలకర్ర : 1 టీస్పూన్
ఆవాలు : పోపుకు తగినన్ని
నూనె : వేయింపుడుకు సరిపడ.
కొత్తిమీర : అలంకరణ కోసం సరిపడినంత.
ఎలా తయారు చేస్తారు..
పుట్టగొడుగుల (మష్రూమ్స్)ను తీసుకొని బాగా శుభ్రం చేసి నీటిలో కడిగి ఉంచుకోవాలి. ఆ తర్వాత బాగా ఉడికించి వాటిని మీడియం సైజు ముక్కలుగా కత్తిరించుకోవాలి. పనీర్‌ను తురుముకోవాలి. బాణలిని పొయ్యి మీద పెట్టి వేడి చేసి, అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వచ్చేలా వేయించాలి.
ఇందులో పచ్చిమిర్చి, మష్రూమ్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్ వేసి కలపాలి. దానిలో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలియతిప్పాలి. పదార్ధాలన్నీ వేగిన తర్వాత దించితే మష్రూమ్స్ పనీర్ రెఢీ. దీనికి కొత్తిమీర అలంకరణ చేసి సర్వ్ చేసుకోవచ్చు.