బ్రేక్‌ఫాస్ట్ పుదీనా రోటి తయారు చేయడం ఎలా?
ఆకు కూరల్లో పుదీనా ఆకుకు ప్రత్యేకమైన ఔషధ గుణాలున్నాయి. పలు రకాలైన రుగ్మతలకు పుదీనా మంచి మందు. అజీర్ణం, కుడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గడానికి పుదీనాను వాడుతారు ఇన్నీ రకాల వ్యాధులను తగ్గించే పుదీనా చేసే రోటీను తింటే రుచితో ఆరోగ్యం కూడా లభిస్తుంది. అంతే కాకుండా పుదీనా రోటిని బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. తయారీకి కావాల్సిన పదార్థాలు : ( పది రోటీల కోసం)గోధుమ పిండి : రెండు కప్పులుపుదీనా ఆకులు : ఒక కప్పుఉప్పు : రుచికి సరిపడానెయ్యి : రెండు టేబుల్ స్పూన్లుతయారు చేసే పద్ధతి : మూకుడులో పుదీనా ఆకు క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి. వేళ్ళతో తేలిగ్గా చిదమాలి. ఆకుతో సహా పదార్థాలన్నీ చాలినంత నీటితో కలుపుకోవాలి. కలిపిన పిండిని అద్ది చపాతీలు నొక్కుకోవాలి. పెనంపై కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకొని నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకొని వేడిగా తినాలి. ఈ రోటీలకు టమోటా సాస్‌తో పిల్లలకు సర్వ్ చేస్తే ఇష్టపడి తింటారు.