బీట్‌రూట్ హల్వా ఏలా తయారు చేస్తారు.....?
బీట్రూట్ ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్ 'బి' పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం, వెంట్రకలు, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీట్‌రూట్ రసం తాగితే రక్తపోటు తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అటువంటి బీట్‌రూట్‌తో హల్వా చేస్తే యమా టేస్టీగా ఉంటుంది. అలాగే బీట్‌రూట్ కర్రీ, వేపుడు వంటివి కూడా మంచి టేస్ట్‌గా ఉంటాయి.బీట్‌రూట్ హల్వా తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు: బీట్‌రూట్: అరకిలో (తురమాలి)పాలు : అరలీటరుకోవా : 10 గ్రాములుపంచదార : రుచికి సరిపడాగసగసాలు : 2 టీస్పూన్లుపిస్తా, బాదం : తగినన్నితయారుచేయు విధానం : స్టవ్‌మీద పాన్ పెట్టి పాలు, బీట్‌రూట్ తురుము వేసి కలుపుతూ ఉడికించాలి. బీట్‌రూట్ పచ్చివాసనపోయి, పాలన్నీ ఆవిరైపోయాక కోవా, పంచదార వేసి ఉడికించాలి. పంచదార కరిగిపోయి హల్వాలో కలిసిపోయిన తర్వాత గసగసాలు కూడా వేసి కలపాలి. చివరగా ఇష్టమైతే కాస్త నెయ్యి, పిస్తా, బాదం పప్పులు వేసి కలిపి దించాలి.