బీట్‌రూట్ సలాడ్ తీసుకుంటే..?
బీట్‌రూట్‌లో రక్తాన్ని శుభ్రపరిచే లక్షణం ఉంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం ఫోలిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ పేషేంట్లు ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్ కారక కణాలు వృద్ధి కాకుండా నిరోధిస్తుంది. ఇది త్వరగా జీర్ణం కాదు కనుక మంచి నీరు ఎక్కువగా తాగుతుండాలి.కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్ తురుము - ఒక కప్పు. కొత్తిమీర తరుగు - ఒక టీ స్పూను. నిమ్మరసం - అర టీ స్పూను. టొమాటో తరుగు - రెండు టీ స్పూనులు. ఉప్పు - తగినంత. పోపుకి - నూనె, ఆవాలు. జీలకర్ర, ఎండుమిర్చి కొద్ది కొద్ది తయారీ విధానం:బీట్‌రూట్ తురుములో టొమాటోతరుగు, కొత్తిమీర తరుగు వేయాలి. తరువాత నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా వేయించుకున్న పోపు వేసి ఫ్రెషెగా తినాలి. ఎప్పటికప్పుడు చేసుకోలేని వాళ్ల రెండు మూడు రోజులకి సరిపడా తయారుచేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.