బచ్చలి కంద కూరను టేస్ట్ చేశారా?
బచ్చలికూరలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. పిండిపదార్థాలు - 3.4గ్రా, మాంసకృత్తులు-1.9గ్రా, క్యాల్షియం-60 మి.గ్రాములున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బచ్చలితో కందకూర ఎలా చేయాలో మీకు తెలుసా..? అయితే ట్రై చేసి చూడండి. కావలసిన పదార్థాలు : బచ్చలి కూర - ఒక కట్టకంద - పావు కేజీఆవాలు - రెండు టీ స్పూన్లు నూనె- తగినంత చింతపండు - కాసింత శెనగపప్పు- 1 టీస్పూ మినప్పప్పు- 1 టీస్పూ కరివేపాకు- 2 రెమ్మలు ఉప్పు- సరిపడా పచ్చిమిర్చి- రెండు ఎండుమిర్చి - రెండుతయారీ విధానం : ముందుగా కంద చెక్కు తీసి ముక్కలు చేసుకోవాలి. బచ్చలి కూరను కూడా సన్నగా తరుక్కోవాలి. రెండింటిని శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించి, ఉడికాక నీటిని వేరు చేసుకోవాలి. చింతపండును కొంచెం నీళ్లల్లో నానబెట్టి గుజ్జు తీయాలి. ఆవాలను మెత్తగా నూరుకోవాలి. మరోవైపు బాణలిలో నూనె వేసి కాగాక శెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ముక్కల్ని దోరగా వేపుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆపై ఉడికించిన కూరను అందులో వేసి చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. అయిదు నిమిషాలయ్యాక దించి, ఆవాల ముద్దను వేసి బాగా కలిపితే బచ్చలి కంద కూర రెడీ. ఈ కూరను రోటీల్లోకి, వేడివేడి అన్నంలోకి సర్వ్ చేస్తే టేస్ట్‌గా ఉంటుంది.