Publish Date: Tue, 15 Jul 2008 (19:08 IST)
Updated Date: Tue, 15 Jul 2008 (19:08 IST)
కావలసిన పదార్థాలు :
బియ్యం... ఒక కేజీ
ఉల్లిపాయలు... 2
నూనె లేదా నెయ్యి... 5 టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్... 1 టీస్పూన్
పచ్చిమిరపకాయలు... 5
కొత్తిమీర... ఒక కట్ట
పుదీనా... 2 కట్టలు
పెరుగు... 1 కప్పు
బిర్యానీ ఆకులు... 2
ఏలకులు... 2
లవంగాలు... 2
తయారీ విధానం :
వెడల్పాటి గిన్నెలో నూనె వేడిచేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీనా, లవంగాలు, ఏలకులు, ఉల్లిగడ్డలు కలిపి వేయించాలి.
ఆ తరువాత పెరుగు కలిపి, రెండు లీటర్ల నీటిని పోసి, నీరు మరుగుతుండగా ముందుగా నానబెట్టుకుని ఉన్న బియ్యాన్ని అందులో పోయాలి. బియ్యం బాగా ఉడికిన తరువాత దించబోయేముందు కొత్తిమీర దానికి కలిపి దించేయాలి.