పుచ్చకాయ జ్యూస్ ఇలా తయారు చేయండి
పుచ్చకాయ జ్యూస్ వేసవి తాపాన్ని తీర్చడమే కాదు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయలో ఊబకాయానికి చెక్ పెడుతుంది. పుచ్చకాయలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి చాలా మంచివని పరిశోధనలు తెలియజేశాయి. వాటిలో ఎ, బి, మరియు సి - విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరు ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ లాంటివి అందులో ఉండవు. అలాంటి పుచ్చకాయతో జ్యూస్ ఎలా చేయాలో తెలుసా..?కావలసిన పదార్థాలు:పుచ్చకాయ - ఒకటి. నిమ్మకాయ - ఒకటి. అల్లం - చిన్న ముక్క. చాట్ మసాల - ఒక స్పూన్. పంచదార - 200 గ్రాములు. తయారీ విధానం :ముందుగా పుచ్చకాయ చెక్కు తీసి, విత్తనాలు కూడా తీసివేయాలి. ఆ ముక్కలు, పంచదార నిమ్మరసం, అల్లం ముక్కలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకొని తాగవచ్చు. దానికి చాట్ మసాలా కూడా కలుపుకోవచ్చు.