పనీర్ బటర్ మసాల ఎలా చేయాలో తెలుసా?
పనీర్ అంటేనే పిల్లలు చాలా ఇష్టపడతారు. కర్రీ వెరైటీలు అందరికీ తెలిసిందే. పోషకాలు అధికంగా ఉండే పనీర్‌ను వారానికి రెండుసార్లు పిల్లలు ఇవ్వడం మంచిదంటున్నారు. అలాంటి టోస్ట్, రోస్ట్‌లా కాకుండా పనీర్ బటర్ మసాల చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.కావలసిన పదార్థాలు :పనీర్ - వందగ్రాములు . బటర్ - నాలుగు టేబుల్ స్పూన్లు. ధనియాలపొడి - అర టీ స్పూను. క్రీమ్ - నాలుగు టేబుల్ స్పూన్లు. ఉల్లిపాయ తరుగు - ఒక కప్పుటొమాటో తరుగు - అరకప్పు. కారం - రెండు టీ స్పూను. ఉప్పు - అర టీ స్పూను. జీడిపప్పు - తాలింపుకు సరిపడాఫుడ్ కలర్ మీ కిష్టమైనది తయారీ విధానం :ముందుగా పనీర్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి. బాణలిలో బటర్ వేసి వేడిచేసి జీలకర్ర, జీడిపప్పు పలుకులు వేసి అవి వేగిన తరువాత టొమాటో, కారం, ఉప్పు, ధనియాల పొడి వేయాలి. అవన్నీ కొద్దిగా మగ్గిన తరువాత పనీర్ ముక్కలు వేయాలి. ఈ ముక్కల మీద క్రీమ్ వేస్తే ఒక మోస్తరుగా వేడెక్కుతుంది. అప్పుడు ఫుడ్ కలర్ వేసి కలిపి దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. క్రీమ్‌ను స్టవ్ మీద నుంచి దించి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తరువాత గార్నిష్ చేయబోయే ముందుగా వేసినా సరిపోతుంది. ఇది రోటీ, నాన్, చపాతీలలోకి సైడిష్‌గా సర్వ్ చేస్తే అదిరిపోద్ది.