పనీర్ టిక్కా ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?
ఒబెసిటీకి దివ్యౌషధంగా పనిచేసే పనీర్‌తో పసందైన వంటకాలు చేసుకోవచ్చు. త్వరగా జీర్ణం అయ్యే పనీర్‌ను పిల్లలకు ఏమాత్రం ఆలోచించకుండా తినిపించవచ్చు. అలాంటి పనీర్‌తో టిక్కా ఎలా చేయాలో చూద్దాం.కావలసిన పదార్థాలు : పనీర్ - అరకేజీ పుల్లని పెరుగు - మూడు కప్పులు మిరప పొడి - రెండు టీ స్పూన్లుగరం మసాలా - రెండు టీ స్పూన్లు అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు తండూరీ కలర్ - రెండు టీ స్పూన్లుతయారీ విధానం : పెరుగులో మిరపపొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తండూరీ కలర్‌ను కలుపుకోండి. పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ మిశ్రమంలో సుమారు రెండు గంటల సేపు నానబెట్టండి. తర్వాత ఈ పనీర్ ముక్కల్ని పాన్‌పై దోరగా వేయించుకోవాలి. లేదా గ్రిల్‌లో పనీర్ ముక్కల్ని పది నిమిషాల పాటు వేపండి. ఇంకా కబాబ్ స్టిక్‌లో పనీర్ ముక్కల్ని గుచ్చి పొయ్యిపై లేత దోరగా వేయించుకోవచ్చు.ఎలా సర్వ్ చేయాలంటే.. ఒక పనీర్ ముక్క తర్వాత ఓ టమోటా ముక్క ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్క ఇలా ఒకటి తర్వాత కబాబ్ స్టిక్స్‌లో గుచ్చి కెచప్ లేదా టమోటా, చిల్లీసాస్‌తో సర్వ్ చేయొచ్చు.