నవరాత్రి స్పెషల్: సగ్గు బియ్యం వడ తయారీ!
నవరాత్రుల్లో రోజూ ఏదో ఒక వంటకాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. లేదా నవరాత్రి సెలవుల్లో పిల్లలకు నచ్చిన వంటకాలను రుచి చూపించవచ్చు. అలాంటి కరకరలాడే సగ్గుబియ్యం వడల తయారీ విధానం మీకోసం.. కావలసిన పదార్థాలు:ఉడికించి బంగాళదుంప: అర కప్పుసగ్గు బియ్యం: ఒక కప్పుపచ్చిమిర్చి: 8 లేక తొమ్మిదివేరు శెనగ: అరకప్పు,ఉప్పు: తగినంత, నూనె వేయింపుకు సరిపడా. తయారీ విధానం:ముందుగా కడిగిన సగ్గుబియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన సగ్గు బియ్యాన్ని నీరు లేకుండా వడికట్టి ఓ పాత్రలోకి తీసుకోవాలి. సగ్గుబియ్యంలో పచ్చిమిర్చి, వేరుశెనగ, ఉప్పు మిశ్రమాన్ని కలిపి వడకు తగినట్లు సిద్ధం చేసుకోవాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడయ్యాక సగ్గుబియ్యం మిశ్రమాన్ని వడల్లా నూనెలో దోరగా వేయించుకుని టమోటా, చిల్లీ సాస్ లేదా ఏదైనా చట్నీతో వేడివేడిగా సర్వ్ చేయాలి.