ద్రాక్ష పండ్లతో మాల్‌పూరి తయారు చేయడం ఎలా...?
ద్రాక్షపండ్లలో పోషకాలు చాలా వున్నాయి. ఆంటీ-యాక్సీడెంట్లు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ద్రాక్ష పండ్లను జ్యూస్, సలాడ్ల రూపంలోనే గాకుండా వంటల్లో కూడా చేర్చుకోవచ్చు. అలాంటి ద్రాక్షతో మాల్ పూరి ఎలా తయారు చేయాలో చూద్దామా. కావలసిన పదార్థాలు : ఆకుపచ్చ ద్రాక్షలు : 100 గ్రాములుమైదా : ఒక కప్పుపాలు : ఒకటిన్నర కప్పుపచ్చి కొబ్బరి తురుము : అర కప్పుపంచదార పొడి : నాలుగు టేబుల్ స్పూన్లుస్వీట్కోవా : అరకప్పు, బేకింగ్ పౌడర్ : అర టీ స్పూన్యాలకుల పొడి : కొద్దిగారిఫైండ్ నూనె : వేగించడానికి సరిపడాటూటీ ఫ్రూటీ, చెర్రీ, జీడిపప్పులు : కొన్నితయారీ విధానం : ఒక గిన్నెలో మైదా, పాలు, బేకింగ్ పౌడర్, పంచదార వేసి గరిటతో జారుగా (దోసపిండిలా) కలపాలి. తరువాత ద్రాక్షల్ని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ముందుగా తయారు చేసుకున్న పిండిలో కలపాలి. కడాయిలో నూనె వేసి అది వేడెక్కాక ఒక గరిటెడు పిండిని పెనం మీద దోసెలా వేసి కాల్చాలి. తరువాత ఒక పళ్లెంలో దోసెని ఉంచి దాని మీద కొద్దిగా కోవా, కొన్ని ద్రాక్ష ముక్కలు, జీడిపప్పు పెట్టి సగానికి మడవాలి. దానిపైన చెర్రీ, ద్రాక్ష పెట్టి, కొద్దిగా కొబ్బరి పొడి చల్లి సర్వ్ చేస్తే నోరూరించే మాల్‌పూరి రెడీ.