టమోటా మసాలా బజ్జీ ఎలా తయారు చేయాలి?
, శనివారం, 15 డిశెంబరు 2012 (17:32 IST)
టమోటాను రోజూ తీసుకుంటే క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చును. అలాంటి టమోటాను వంటల్లో వాడటమే గాకుండా.. జ్యూస్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఇంకా పిల్లలకు నచ్చాలంటే టమోటాలతో కాస్త మసాలా చేర్చి బజ్జీలుగా సర్వ్ చేస్తే ఇష్టపడి తింటారు.కావలసిన పదార్థాలు : టమోటాలు : 1/2 కేజీబంగాళాదుంపలు: 1/2 కేజీనూనె: వేయించేందుకు సరిపడా గరంమసాలా: 2 టేబుల్ స్పూన్లుకొత్తిమీర: 1 కప్పుపెసరపప్పు: 4 టీస్పూన్లు ఉల్లిపాయలు: 3 పచ్చిమిర్చి: 4 శనగపిండి: 1 కప్పుతయారీ విధానం: ముందుగా టమోటాలను ఒకే సైజుగా ఉండేటట్టు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును, బంగాళాదుంపలను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. టమోటాల్లో గుజ్జు, విత్తనాలను తీసేసి పక్కనుంచాలి. తర్వాత ఉడికించిన పప్పు, బంగాళాదుంపల మిశ్రమంలో గరంమసాలా, ఉప్పు, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగులను కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని టమోటాల్లో కూరాలి. ఈ టమోటాలను జారుగా కలిపి ఉంచిన శెనగపిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే టమోటా మసాలా బజ్జీ రెడీ. వీటికి గ్రీన్ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది.