టమోటా పప్పు ఎలా చేయాలో తెలుసా!?
, గురువారం, 15 నవంబరు 2012 (16:43 IST)
కావలసిన పదార్ధాలు :టమోటాలు : అరకేజీచింతపండు, ఉప్పు : తగినంతకందిపప్పు : 250 గ్రా. నూనె : తగినంత పచ్చిమిర్చి : ఐదు కరివేపాకు : 2 రెబ్బలు. ఉప్పు : సరిపడినంత. వెల్లుల్లి : రెండు రేకులు. కారం : అర టీ స్పూన్. కొత్తిమీర తరుగు : కొంచెం. ఎండుమిర్చి : ఒకటి. పసుపు : చిటికెడు. పోపులు : సరిపడినంత. ఉల్లిపాయలు : రెండు ఇంగువ : చిటికెడు. తయారీ విధానం :ముందుగా కందిపప్పు బాగా కడిగి ఉడకబెట్టాలి. సగం బాగా ఉడికాక, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉప్పు, పసుపు, కారం, చింతపండు పులుపు పోసి ఉల్లిపాయ ముక్కలు ఉడికేంతవరకు ఉంచాలి. తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి కాగాక నూనె పోయాలి. నూనె మరిగాక పోపుగింజలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, కొత్తిమీర వేసి వేయించి పప్పులో వేసి బాగా కలిపి దించుకోవాలి. టమోటా పప్పును రోటీలకు లేదా వేడి వేడి అన్నానికి సైడిష్‌గా సర్వ్ చేయొచ్చు.