జీడిపప్పు వడలు టేస్ట్ చేయండిలా..!!
, శనివారం, 21 ఏప్రియల్ 2012 (12:17 IST)
కావలసిన పదార్థాలు :వేయించిన సెనగ పప్పు - కప్పున్నర;మైదా - రెండు కప్పులు;బియ్యప్పిండి - కప్పున్నర;నెయ్యి - రెండు చెంచాలు;జీడిపప్పు - పావుకప్పు;పచ్చిమిర్చి - పది;కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా;ఉప్పు - తగినంత;నూనె - సరిపడినంత;తయారు చేసే విధానం :సెనగపప్పును మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని తరిగి ముద్దగా చేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ (వేయించిన సెనగపప్పు, మైదా, బియ్యప్పిండి, నెయ్యి, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు) కలుపుకొని కాసిని నీళ్లు చేర్చుకొని ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాలయ్యాక బాణలిలో నూనె వేడి చేసి, పిండిని చేత్తో అద్దుకొని వేయిస్తే వేడి వేడి వడలు తయారయినట్టే.