కావలసిన పదార్థాలు :
అరటికాయలు... రెండు
పచ్చిమిర్చి... నాలుగు
ధనియాలు... రెండు టీ.
చింతపండు... 25 గ్రా.
వెల్లుల్లి... పది రేకలు
జీలకర్ర... 5 గ్రా.
పెరుగు... పావు లీ.
ఉల్లిపాయ... ఒకటి
కరివేపాకు... రెండు రెబ్బలు
కొత్తిమీర... ఒక కట్ట
ఆవాలు... అర టీ.
నూనె... సరిపడా
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
అరటికాయల తొక్కు తీసి ముక్కలుగా కోసి ఉడకబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, దనియాలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి వేయించాలి. చింతపండు, ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉప్పు , పచ్చిమిర్చి పోపు... అన్నీ మిక్సీలో లేదా రోట్లో వేసి మెత్తగా రుబ్బాలి. ఇందులో పెరుగు వేసి కలపాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలుతో పోపు చేసి పచ్చడిలో కలిపితే పెరుగు పచ్చడి సిద్ధం.
పెరుగులో కార్బోహైడ్రేటులు, చక్కరె, ట్రాన్స్ ఫ్యాట్స్ తదిరాలు 0 శాతంతో ఉండగా... కాల్షియం 20 శాతం ఉంటుంది. ఇది ఎముకల ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. జంక్‌ఫుడ్‌కు ప్రత్యామ్నాయంగా చక్కగా పెరుగును తీసుకోవచ్చు. దీనిద్వారా విటమిన్ బి పుష్కలంగా అందుతుంది. అంతేగాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.