క్యాలీఫ్లవర్ రైస్ ఎలా చేయాలో మీకు తెలుసా!?
, గురువారం, 8 నవంబరు 2012 (18:05 IST)
కావలసిన పదార్ధాలు:బాస్మతి బియ్యం - రెండు కప్పులు. నూనె - పావు కప్పు. పసుపు - ఒకటేబుల్ స్పూన్. క్యాలీఫ్లవర్ - ఒకటి. ఆలుగడ్డలు - మూడు. అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్. పచ్చిమిర్చి - నాలుగు. ఉల్లిపాయలు - మూడు. టమోటాలు - మూడు. ఉప్పు - తగినంత. తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని నూనెలో కొద్దిగా వేయించి ఉడికించి పక్కన బెట్టుకోవాలి. కాలిఫ్లవర్‌ను వేడినీటిలో ఉడికించుకోవాలి. తర్వాత ఆలుగడ్డలను చిన్న ముక్కలు చేసి నూనెలో వేయించాలి. పాన్‌లో నూనె వేసి, తరిగినఉల్లిపాయ ముక్కలను వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్టును, తరిగిన టమోటాలను కూడా వేపుకోవాలి. తర్వాత పసుపు పొడి, కారం, పొడి మసాలా, పచ్చిమిర్చి ముక్కలు కూడా అందులో వేసి వేపుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి చివరిగా ఉడికించిన కాలిఫ్లవర్‌ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన బాస్మతి రైస్‌తో కలుపుకుని, ఆలు ముక్కులు చేర్చి హాట్ హాట్‌గా చికెన్ గ్రేవీతో సర్వ్ చేయొచ్చు.