Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యారట్ సూప్ ఎలా చేయాలి..?

Advertiesment
క్యారట్ సూప్
FILE
విటమిన్ ఎ, మినరల్స్ పుష్కలంగా ఉన్న క్యారట్‌తో వర్షాకాలంలో సూప్ సిప్ చేస్తే ఎలా ఉంటుంది.. అయితే క్యారట్ సూప్ ఎలా చేయాలో చూద్దామా..

కావలసిన పదార్థాలు:
క్యారట్ - పావు కేజీ
ఉల్లిపాయ - రెండు.
పెసరపప్పు - ‌ఒక టేబుల్ స్పూన్‌.
వెన్న తీసిన పాలు - ఒక కప్పు.
ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత.

తయారీ విధానం:
ముందుగా క్యారట్, ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కల్లో పెసరపప్పు, మూడు టీ స్పూన్ల నీటిని వేసి ఫ్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ఒంపుకోవాలి.

ఇందులో వేడిపాలను వేసి బాగా కలపాలి. చివరగా ఉప్పు, మిరియాల పొడి కలిపి ఒక నిమిషం సేపు ఉడికించి దించేయాలి. దీనిని వేడివేడిగా సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu