క్యాబేజీ, క్యాప్సికమ్‌లతో పులావ్ ఎలా చేయాలి..!?
, మంగళవారం, 9 ఆగస్టు 2011 (16:04 IST)
మీ ఇంట్లో పార్టీ ఏదైనా అరేంజ్ చేశారా.. అయితే క్యాబేజీ, క్యాప్సికమ్ పులావ్లతో అతిథులకు సర్వ్ చేసి సూపర్ అని చెప్పించండి. ఇక పులావ్ తయారీ విధానం తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు:బాస్మతి రైస్: పావు కేజీ క్యాప్సికమ్: పావు కప్పుక్యాబేజీ : అరకప్పు.ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు.అల్లం, వెల్లుల్లి పేస్ట్: మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి పేస్ట్: టేస్ట్‌కు తగినంత ఉప్పు : తగినంత నూనె : వేపుడుకు తగినంత.తయారీ విధానం: బాణలిలో కొద్దిగా నూనె పోసి బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను దోరగా వేపుకోవాలి, అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని కూడా నూనెలో రెండు నిమిషాల పాటు వేయించాలి. ఉల్లిపాయ, క్యాప్సికమ్ దోరగా వేగాక, క్యాబేజీ ముక్కల్ని కూడా అందులో చేర్చాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ను కలపాలి. కాసేపయ్యాక ఈ మిశ్రమంలో బియ్యాన్ని కలుపుకోవాలి. ఇందుకు తగిన ఉప్పుకూడా చేర్చుకుని తగినంత నీటిని జతచేసి బియ్యం ఉడికాక ఓ ప్లేటులోకి తీసుకుని మీ ఫేవరేట్ సైడిష్ లేదా చికెన్ గ్రేవీ, చిల్లీ, టమోటా సాస్‌లలో వేడివేడిగా సర్వ్ చేయొచ్చు.