క్యాబేజి కోఫ్తా కూర తయారు చేయడం ఎలా ?
, బుధవారం, 23 జనవరి 2013 (18:37 IST)
క్యాబేజి కోఫ్తా కూర తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు : క్యాబేజి తురుము - కప్పు చిన్న ఉల్లిపాయలు - రెండుపెద్ద ఉల్లిపాయ - ఒకటి (తరగాలి) ఉప్పు, కారం - రుచికి తగినంత గరంమసాలా - చెంచాసెనగపిండి - కప్పులవంగాలు - రెండుదాల్చిన చెక్క - చిన్నముక్కయాలకులు - మూడుఅల్లం - చిన్నముక్కజీలకర్ర, ధనియాలు, గసగసాలు - చెంచా చొప్పునజీడిపప్పు - నాలుగైదుపచ్చిమిర్చి - ఐదుటమాటా - ఒకటికొత్తిమీర - అరకప్పుపెరుగు - చెంచానూనె- వేయించడానికి సరిపడా తయారు చేయు విధానం : గిన్నెలో క్యాబేజి తురుము, ఉప్పు, కారం, గరంమసాలా, సెనగపిండి తీసుకొని కాసిని నీళ్లు చేర్చి గట్టిపిండిలా కలపుకోవాలి. ఇప్పుడు బాణిలో నూనె వేడి చేసి ఈ పిండిని ఉండల్లా వేసుకోవాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేస్తే సరిపోతుంది. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అల్లం, జీడిపప్పు, టమాటా ముక్కలు అన్నీ కలిపి మిక్సీలో మెత్తగా ముద్ద చేసుకోవాలి. మరో బాణలిలో జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఉల్లిపాయ తరుగు వేయాలి. ముక్కలు మగ్గాక మసాలా ముద్దను చేర్చాలి. కొద్దిసేపయ్యాక పెరుగు, ఉప్పు వేసి కాసిని నీళ్లు చేర్చి మూత పెట్టిమంట తగ్గించాలి. పదినిమిషాలయ్యాక గ్రేవీ చిక్కగా తయారవుతుంది. అందులో క్యాబేజీ కోఫ్తా ఉండల్ని వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి. వేడి వేడి కోఫ్తా కూరను చపాతీ లేదా పూరీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.