కొత్తిమీర రైస్ తినండి.. ఒబిసిటీకి చెక్ పెట్టండి.
కొత్తిమీరకు శరీరంలో కొవ్వుని తగ్గించే గుణం ఉంది. కొత్తిమీరకు కాసిన్ని ధనియాలని కలిపి రసంలా తీసుకుంటే క్రమంగా కొవ్వు కరుగుతుందట. కామెర్లు, నోటి దుర్వాసనలతో బాధపడేవారు నేరుగా కొత్తిమీర ఆకుల్ని నోటిలో తీసుకుంటే లేదా పెరుగులో కలిపి తీసుకుంటే సమస్య నుండి తొందరగా బైట పడవచ్చు. సో అలాంటి కొత్తిమీరతో రైస్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా.. కావలసిన వస్తువులు:
బియ్యం - 3 కప్పులు.
కొత్తిమీర తరుగు - నాలుగు కప్పులు
పచ్చిమిచ్చి - 8. అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు. టొమాటో - 5. లవంగాలు - 6. ఏలకులు - 2. దాల్చినచెక్క - 2. ఉప్పు, నూనె - తగినంత. తయారీ విధానం: ముందుగా పాత్రలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక పచ్చిమిచ్చి, కొత్తిమీర వేసి నిమిషం పాటు వేయించుకుని దింపి చల్లార్చుకోవాలి. వేయించిన కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని పేస్ట్‌చేయాలి. కడాయిలో మిగతా నెయ్యి వేసి, మసాలా దినుసుల్ని వేయించాక కొత్తిమీత పేస్ట్ కలిపి వేయించుకోవాలి.తరిగిన టొమాటో ముక్కలు వేసి కలిపి, మూడు నిమిషాలపాటు వేగనిచ్చి ఉప్పు కలపాలి. ఇందులో మూడున్నర కప్పుల నీళ్లుపోసి పరుగుతుండగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలియబెట్టి అన్నం అయ్యేవరకు ఉంచాలి. ఇష్టమైన కర్రీ కాంబినేషన్‌తో కొత్తిమీర రైసుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు.