కరకరలాడే జంతికలు తయారు చేయడం ఎలా...?
పిల్లలకు నచ్చే జంతికలు ఎలా తయారు చేయాలో తెలుసా.. షాపుల్లో అమ్మే జంక్ ఫుడ్ పెట్టకుండా ఇంట్లోనే జంతికలు తయారు చేయాలో తెలుసుకుందామా..కావల్సిన పదార్థాలు : జొన్నపిండి - నాలుగు కప్పులువెన్నలేదా నెయ్యి - చెంచాఉప్పు - తగినంత జీలకర్ర - అరచెంచా నువ్వులు - చెంచాపచ్చిమిర్చి పేస్టు - ఒకటిన్నర చెంచాఅల్లం వెల్లుల్లి పేస్టు - పావుచెంచా వాము - పావుచెంచానూనె - వేయించడానికి సరిపడాతయారీ : ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని బాగా కలపాలి. ఆ తరువాత వేడినీళ్లు పోస్తూ గట్టిగా ముద్దలా కలపాలి. ఇప్పుడు బాణిలిలో నూనె వేడిచేసి మంట తగ్గించాలి. గోరువెచ్చని నీటితో చేయిని తడిచేసుకుని తరువాత పిండిని తీసుకుని జంతికల గొట్టంలో ఉంచి నూనెలో జంతికల్లా వేయాలి. ఎర్రగా వేగాక తీస్తే సరిపోతుంది. జొన్నపిండి జంతికలు సిద్ధం.