అరటి పువ్వుతో రుచికరమైన వడలు
, సోమవారం, 19 నవంబరు 2012 (13:05 IST)
కావల్సిన పదార్థాలు :అరటి పువ్వు : 150 గ్రాములుమజ్జిగ : కప్పుశనగపప్పు : 250 గ్రాములుఉప్పు : తగినంత ఎండుమిరపకాయలు : రెండు ఉల్లిపాయ ముక్కలు : అరకప్పుకొబ్బరి తురుము : అర కప్పుపచ్చిమిరపకాయలు : ఒకటి తయారీ విధానం: అరటి పువ్వును సన్నగా తరిగి, మజ్జిగలో నానబెట్టుకోవాలి. తర్వాత శనగపప్పును 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టాలి. ఎండుమిరపకాయలు వేసి కచ్చాపచ్చిగా రుబ్బుకోవాలి. మజ్జిగ నుంచి అరటి పువ్వుతీసి రుబ్బిన పప్పులో కలుపుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కొబ్బరి తురుము, ఉప్పువేసి కలియబెట్టాలి. చిన్న చిన్న ఉండలు చేసుకుని అరచేతిలో నొక్కి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. రెడీ అయిన అరటి పువ్వు వడలను కొబ్బరి చట్నీతో హాట్ హాట్‌గా సర్వ్ చేయవచ్చు.