అరటి పువ్వుతో కొబ్బరి పచ్చడి తయారు చేయడం ఎలా?
కావలసిన పదార్థాలు : అరటి పువ్వు : ఒకటి కొబ్పరి తురుము : కప్పుపచ్చమిర్చి : ఆరుపోపు : తగినంత ఎండు మిర్చి : 15శనగపప్పు : 2 టీ స్పూన్లుమినపప్పు : 2 టీ స్పూన్లుఆవాలు : టీ స్పూనుజీలకర్ర : టీ స్పూనుమెంతులు : అర టీ స్పూనుఇంగువ : చిటికెడుపసుపు : చిటికెడుఉప్పు : తగినంతచింతపండు : కొద్దిగానూనె : 5 టీ స్పూన్లుబెల్లం : రెండు టీ స్పూన్లుతయారు చేయు విధానం : ముందుగా అరటి పువ్వును శుభ్రం చేసుకోవాలి. మిక్సిలో వేసి వక్కలుముక్కలుగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత మంచినీళ్లతో శుభ్రంగా కడిగి నీరు పిండేయాలి. స్టౌ మీద బాణిలి ఉంచి నూనె వేసి కాగాక శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాణిలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కచ్చాపచ్చగా చేసి ఉంచుకున్న అరటి పువ్వును వేసి మగ్గనివ్వాలి. మిక్సిలో ముందుగా చల్లార్చిన పోపు వేసి మొత్తగా గ్రైండ్ చేయాలి. వేయించి పెట్టుకున్న అరటిపువ్వు ముద్ద, ఉప్పు, పసుపు, ఇంగువ, చింతపండు, బెల్లం వేసి మెత్తగా మిక్సీలో పట్టాలి.