అరటి కబాబ్‌ను ఎలా తయారు చేస్తారు?
, శనివారం, 20 జులై 2013 (16:43 IST)
అరటి కబాబ్‌ను ఎలా తయారు చేస్తారన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలను పరిశీలిస్తే... పచ్చి అరటికాయలు - నాలుగు, తగినంత ఉప్పు, అర టీస్పూన్ గరం మసాలా పొడి, ఒక టీస్పూన్ జీలకర్ర, అల్లం పేస్ట్, పచ్చిమిరచకాయల పేస్ట్ తగినంత, నాలుగు స్పూన్ల నెయ్యి, ఒక స్పూన్ కొత్తిమీర, ఒక స్పూన్ కారంతో పాటు.. అలంకరణ కోసం ఎండు అత్తిపండ్లు 100 గ్రాములు, అల్లం - 20 గ్రాములు, పచ్చిమిరపకాయలు - 15 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు - కొద్దిగా, కొత్తిమీర - కొద్దిగా, కుంకుమ పువ్వు - కొద్దిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా తయారు చేస్తారు? పచ్చి అరటికాయలను ఉడికించి తోలు తీసివేయాలి. చల్లారే దాకా పక్కన వుంచుకోవాలి. చల్లారిన తర్వాత అరటికాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టంఫింగ్ పదార్థాలన్నింటినీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అరటికాయ ముక్కలకు సన్నగా తరిగిన స్టంఫింగ్ ముక్కలను కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అరచేతిలో చిన్న ఉండలుగా తీసుకుని వాటిని గుండ్రంగా నొక్కుకుని, పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బాగా కాల్చాలి. అంతే వేడి వేడి అరటికాయ కబాబ్స్ రెడీ. వీటిని టమాటో సాస్‌తో తింటే ఇంకా ఎంతో రుచితో ఉంటాయి.