Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెజ్ మ్యాంగ్ చీజ్ కేక్ ఎలా చేయాలి?

Advertiesment
Veg mango cheese cake recipe
, శుక్రవారం, 27 జూన్ 2014 (17:18 IST)
వేసవిలో మామిడిపండ్లు విరివిగా మనకు అందుబాటులో ఉంటాయి. ఘుమఘుమలాడే మామిడిపండ్లంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. అటువంటి ఈ వండర్ ఫుల్ ఫ్రూట్ తో వివిధ రకాలుగా వంటలు తయారుచేయవచ్చు. ముఖ్యంగా పిల్లలకు అత్యంత ఇష్టమైన డిజర్ట్ మ్యాంగో చీజ్ కేక్. మ్యాంగో చీజ్ కేక్ స్పెషల్ డిజర్ట్ రిసిపి. బాగా పండిన మామిడి పండ్లతో తయారుచేస్తారు. అదెలాగో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు :
హెవీ క్రీమ్ : ఒక కప్పు 
కన్ఫెక్షనరీ పంచదార: రెండు టేబుల్ స్పూన్లు 
మేరీ బిస్కెట్ల పొడి: మూడు కప్పులు 
పనీర్ తురుము: అరకప్పు 
క్రీమ్ చీజ్: 150 గ్రాములు 
పనీర్: వందగ్రాములు 
పాలు: పావు కప్పు
పంచదార పొడి: ఆరు టేబుల్ స్పూన్లు 
కరిగించిన బటర్: నాలుగు టేబుల్ స్పూన్లు 
వెనీలా ఎసెన్స్: ఒక టేబుల్ స్పూన్ 
మామిడిపళ్లు: 2 
మామిడిపండు గుజ్జు: అరకప్పు
 
తయారీ విధానం :  
ముందుగా ఒక పాత్రలో హెవీ క్రీమ్.. కన్ఫెక్షనరీ పంచదార వేసి బాగా కలపాలి. బిస్కెట్ల పొడి కరిగిపోయేలా కరగాలి. తర్వాత సర్వింగ్ బౌల్స్‌లో ఈ మిశ్రమాన్ని కింద వేసి గట్టిగా ఒత్తి వీటిని డీప్ ఫ్రిజ్‌‌లో సుమారు 10 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత పనీర్‌ను సన్నగా తురిమి కొద్దిగా నీరు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి.
 
పనీర్ మిశ్రమానికి పంచదార పొడి, వెనీలా ఎసెన్స్, క్రీమ్ చీజ్ జత చేసి మెత్తగా అయ్యేవరకు గిలక్కొట్టాలి. మామిడి పండు తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సగం ముక్కలను చీజ్ మిశ్రమంలో వేయాలి. క్రీమ్ చీజ్ మిశ్రమాన్ని చీజ్ కేక్ బేస్ మీద పోసి, స్పూన్‌తో సర్దాలి. మామిడి పండు గుజ్జును పైన వేసి సుమారు గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. చివరగా చీజ్ కేక్ పైన మామిడి పండు ముక్కలతో అలంకరించి సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu