కావలసిన వస్తువులు :
బియ్యం.. పావు కేజీ
కొబ్బరి కాయ... ఒకటి
పాలు.... పావు లీటర్
జీడిపప్పు.... 25 గ్రాములు
ఎండు ద్రాక్ష.... 25 గ్రాములు
యాలకులు....ఆరు
నెయ్యి.... వంద మిల్లీ
తయారీ విధానం :
బియ్యం నీళ్ళలో బాగా కడిగి శుభ్రం చేసి ఒక బట్టపై వేసి నీడలో ఆరబెట్టాలి. కొంతసేపటి తర్వాత బాణలిలో కొంచెం నెయ్యి వేసి బియ్యాన్ని వేయించుకోవాలి. మరో వైపు నెయ్యితో క్యారెట్ తురుమును వేయించాలి. పావు లీటర్ పాలుకు పావు లీటర్ నీళ్ళు తీసుకుని ఒక గిన్నెలో పోయాలి. అందులో బియ్యం పోసి ఉడికించాలి.
అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత అందులో క్యారెట్ తురుము, జీడిపప్పు, యాలకులపొడి, నెయ్యి, ఎండుద్రాక్ష వేసి కలిపి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. అంతే... వేడివేడి కార్యెట్ తురుము పొంగలి రెడీ అయినట్లే..!