Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్న్ పకోడి తయారీ ఎలా?

Advertiesment
కార్న్ పకోడి తయారీ ఎలా?
, సోమవారం, 17 నవంబరు 2014 (17:35 IST)
కావలసిన పదార్థాలు :
కాస్త ముదురుగా ఉన్న జొన్న గింజలు - మూడు కప్పులు, 
ఉల్లిపాయలు - రెండు, 
పచ్చిమిర్చి - ఐదు, 
జీలకర్ర - చెంచా, 
నూనె - వేయించడానికి సరిపడ, 
ఉప్పు - తగినంత.
 
తయారు చేయు విధానం :
ముందుగా మొక్కజొన్న గింజలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, జీలకర్ర, ఉప్పులను వేసి కలిపి ఓ తిప్పు తిప్పండి. బాణాలిలో నూనె వేసి కాగాక, ఈ పిండిని పకోడీలుగా వేయండి. అటు ఇటు తిప్పుతూ బంగారు వన్నె వచ్చేంతవరకు వేయించండి. వీటిని పుదీనా చట్నీతో సర్వ్ చేయండి. మొక్కజొన్నతో చేసినవి కాబట్టి శరీరానికి కావలసిన విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu