కావలసిన పదార్థాలు:
పెరుగు - 3 కప్పులు
దోసకాయ - 1
క్యాప్సికం - 2
ఉప్పు - సరిపడా
కొత్తిమీర - పావుకప్పు
నూనె - కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా క్యాప్సికం, దోసకాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ మాత్రం నూనెలో వేయించి తీసేయాలి. ఆ తరువాత పెరుగులో కొద్దిగా ఉప్పు, దోసకాయ ముక్కలు, వేయించి క్యాప్సికం, కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. అంతే క్యాప్సికం రైతా రెడీ. ఈ రైతాను బిర్యానీ, పరోటా, చపాతీల్లోకి తీసుకుంటే బాగుంటుంది.