తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. తమలపాకుతో మిరియాలు కలిపి రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. ఇవి చేస్తే కిడ్నీ సంబంధిత రోగాలు దూరమవుతాయి.
తయారీ విధానం :
తమలపాకులు - ఐదు
నెయ్యి - 2 చిటికెడు
ఆవాలు - పావు చిటికెడు
ఎండు మిర్చి - 3
జీలకర్ర - 1 చిటికెడు
మిరియాలు - చిటికెడు
వెల్లుల్లి - 5 రెబ్బలు, టొమాటో - 1
చింతపండు - నిమ్మకాయంత
పసుపు పొడి - పావు టీ స్పూన్,
తోటకూర - పావు టీ స్పూన్
ఉప్పు - కావలసిన పరిమాణం,
నిమ్మరసం - ఒక స్పూన్
కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా.
తయారీ విధానం :
Beetel Leaves Recipe
ఎండు మిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, టమోటాలు, తమలపాకులను పేస్ట్‌లా గ్రైండ్ చేయండి. చింతపండు విడిగా కలిపి తీసుకోవాలి. అందులో పసుపు, వెల్లుల్లి, ఇంగువ, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేయాలి. బాణలిలో నెయ్యి వేసి, ఆవాలు వేసి, చింతపండు రసం వదిలి చిన్న మంట మీద మరిగించాలి. తరవాత రుబ్బిన తమలపాకు పేస్ట్ వేయాలి. అవసరమైన ఉప్పు వేసి బాగా మరిగిన తర్వాత నిమ్మరసం వేస్తే రుచికరమైన తమలపాకు రసం రెడీ.