వేడి వేడి వెజిటబుల్ సమోసాలు తయారు చేయడం ఎలా?
, శనివారం, 23 మార్చి 2013 (16:34 IST)
వెజిటబుల్ సమోసా ఇదీ రొటినీ కదా అనుకోకండి. వెజిటబుల్‌ను ఎప్పుడూ తాలింపుల్లా కాకుండా.. సాయంత్రం పిల్లలకు నచ్చే విధంగా సమోసాల్లా తయారు చేసి సర్వ్ చేయండి. కావాల్సిన పదార్థాలు : నూనె : రెండు టేబుల్ స్పూన్లుఉల్లిపాయ : ఒకటి వెల్లుల్లి : రెండు రెబ్బలుజీలకర్ర : ఒక టీ స్పూనుఎండుమిరపకాయ ముక్కలు : ఒక స్పూన్ కర్రిపౌడర్ : ఒక టేబుల్ టీ స్పూనుబంగాళా దుంప : ఒకటి పప్పులు : ఒక కప్పు బఠాణీలు : ఒక కప్పునీరు : ఒక కప్పుమైదాపిండి : మూడు కప్పులుగోరువెచ్చని నీరు : ఒక కప్పుతయారుచేసే విధానం :మూకుడులో మధ్యస్థంగా వున్న సెగపై నూనెవేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కర్రిపౌడర్, జీలకర్ర, చిల్లిఫ్లేక్స్ కలిపి ఒక నిమిషం ఉడికించి, బంగాళా దుంపలు, బఠాణీలు, నీరు కలిపి, సెగతగ్గించి 20 నిమిషాలు లేదా బంగాళాదుంపలు మొత్తబడేదాకా ఉడికించాలి. పావుకప్పు నీటిలో టేబుల్ స్పూన్ పిండి కలిపి మిశ్రమంలో పోసి చిక్కబడేవరకూ ఉడికించాలి. మైదా పిండిని గోరు వెచ్చని నీటితో కలుపుకుని చపాతి మాదిరి నొక్కి ప్రతిదానిలో బంగాళాదుంప మిశ్రమం ఉంచి త్రికోణాకారంలో ముడుచుకోవాలి. నూనెలో బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. వీటిని వేడివేడిగా టమోటా సాస్‌తో సర్వ్ చేయాలి.